నితిన్ గడ్కరీని కలిసిన ప్రియాంక గాంధీ.. స్పెషల్ డిష్ వడ్డించి..
వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.
By - Medi Samrat |
వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో కేరళ మీదుగా వెళ్లే ఆరు రోడ్డు ప్రాజెక్టులపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. కొన్ని ప్రాజెక్టులు కేరళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదని, అయితే ప్రాజెక్టులను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీకి నితిన్ గడ్కరీ తన వంట రుచి చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక గాంధీ ఆరు ప్రధాన రహదారుల ప్రాజెక్టులను మంత్రి ముందు ప్రతిపాదించారు. వాయనాడ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఇంతకుముందు రాహుల్ గాంధీతో అమేథీ రోడ్ల గురించి కూడా చర్చ జరిగింది.. రాహుల్ పని తానే చేశానని, ఇప్పుడు మీ పని చేయకపోతే నేను.. మా అన్న పని చేసి.. మా అక్క పని చేయలేదని జనాలు అంటారని గడ్కరీ తన హాస్య శైలిలో అన్నారు.
తాను తీసుకొచ్చిన ఆరు ప్రాజెక్టుల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయని, కాబట్టి వాటిపై కేంద్రం నేరుగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రియాంక గాంధీకి గడ్కరీ స్పష్టం చేశారు. అయితే కేంద్రం పరిధిలోకి వచ్చే ఇతర ప్రాజెక్టులపై సానుకూలంగా హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను గడ్కరీ ప్రస్తావించగా, ప్రియాంక గాంధీ ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పందించారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అయితే పర్వాలేదని, రాష్ట్రంలో (కేరళలో) మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిశీలిస్తామని చెప్పారు.
ఇదిలావుంటే.. గడ్కరీ సొంతంగా రైస్ డిష్ సిద్ధం చేశారు. దీంతో ఈరోజు ఆయన కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చట్నీతో సహా అన్నం ముద్దలు వడ్డించారు. ప్రియాంక గాంధీ ఆయన కార్యాలయానికి రాగా.. ఆమెను వంటకం రుచి చూడాలని గడ్కరీ పట్టుబట్టారు.