పట్టాలు తప్పిన‌ ఎనిమిది వ్యాగన్లు.. తప్పిన పెను ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం నాడు ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

By Medi Samrat  Published on  17 Feb 2024 3:45 PM IST
పట్టాలు తప్పిన‌ ఎనిమిది వ్యాగన్లు.. తప్పిన పెను ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం నాడు ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జఖీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గూడ్స్ రైలులో ఇనుప రేకులు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. మరోవైపు మరో ట్రాక్‌లో ప్రయాణికులతో ఉన్న రైలు ఆగి ఉంది. అటు వైపు బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఉదయం 11:50 గంటల ప్రాంతంలో పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్‌లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

Next Story