గాంధీకి-గాడ్సేకి తేడా చెప్పిన రాహుల్ గాంధీ

At Jaipur rally, Rahul Gandhi slams BJP. ఆదివారం జైపూర్‌లో ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ గాంధీ

By Medi Samrat  Published on  12 Dec 2021 12:41 PM GMT
గాంధీకి-గాడ్సేకి తేడా చెప్పిన రాహుల్ గాంధీ

ఆదివారం జైపూర్‌లో ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ గాంధీ 'హిందూ', 'హిందుత్వ' పదాల మధ్య తేడా గురించి వ్యాఖ్యలు చేశారు. "నేను హిందువును, కానీ నేను హిందుత్వవాది కాదు. మీరందరూ హిందువులే. మహాత్మా గాంధీ హిందువు కానీ నాథూరామ్ గాడ్సే హిందుత్వవాది" అని ఆయన అన్నారు. "మహాత్మా గాంధీ తన జీవితమంతా సత్యాన్వేషణలో గడిపాడు, హిందుత్వవాది గాడ్సే అతనిలోకి మూడు బుల్లెట్లను దింపాడు" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ మరింత వివరిస్తూ.. "నేను మీకు తేడా చెప్పాలనుకుంటున్నాను. హిందువుల మార్గం సత్యం.. వారు నిజం కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. భగవద్గీత హిందువులను సత్యాన్ని కనుగొనమని చెబుతుంది. మరోవైపు హిందుత్వవాదులకు సత్యంతో సంబంధం లేదు అధికార దాహంతో ఉన్నారు. వారి భయం కారణంగా వారు ద్వేషంతో నిండి ఉన్నారు." అని చెప్పుకొచ్చారు. "2014 నుండి, హిందుత్వవాదులు అధికారంలో ఉన్నారు, హిందువులు అధికారానికి దూరంగా ఉన్నారు. వీరు [హిందుత్వవాదులు] తప్పుడు హిందువులు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్.

మెహంగాయి హటావో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ "ఈ ర్యాలీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి సంబంధించినది. మీరందరూ దేశ పరిస్థితిని చూస్తున్నారు. మీరు ధరల పెరుగుదలను అనుభవిస్తూ ఉన్నారు. దేశాన్ని నడిపేది నాయకులు కాదు, 3-4 మంది పెట్టుబడిదారులు ఉన్నారు" అని అన్నారు.


Next Story