గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ "సిద్ధంగానే ఉన్నారు, కానీ రంగంలోకి దిగరు" అని సెటైర్లు సంధించారు. రాహుల్ గాంధీకి చాలా రోజులుగా అలవాటు ఉంది.. గౌహతిలో క్రికెట్ మ్యాచ్ జరిగితే.. ఆయన గుజరాత్‌లో ఉంటారు. గుజరాత్‌కు కూడా ఆయన బ్యాట్, ప్యాడ్ తీసుకువెళతారు.. సిద్ధమవుతూనే ఉంటారు.. కానీ ఫీల్డ్‌లోకి రారు అని వ్యంగాస్త్రాలు సంధించారు.
గుజరాత్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న హిమంత బిస్వా శర్మ.. బీజేపీకి సవాల్ విసురుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల్లో నిలుస్తాయని అన్నారు. "బిజెపి ఉండాల్సిన చోట ఉంది. మాకు పోటీ లేదు. ఆప్, కాంగ్రెస్ రెండు, మూడవ స్థానాల కోసం పోటీ పడుతున్నాయి" అని హిమంత బిస్వా శర్మ అన్నారు. వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి చారిత్రపై అవగాహన చాలా తక్కువ అని ఎద్దేవా చేశారు.
.