పెట్రోల్‌ లీటర్‌ రూ.200కు చేరితే బైక్‌పై ముగ్గురికి అనుమతి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.!

Assam bjp chief sensational comments. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపై అసోం బీజేపీ అధ్యక్షుడు భాబేష్ కలిట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు లీటర్ రూ.200కు

By అంజి  Published on  20 Oct 2021 6:18 PM IST
పెట్రోల్‌ లీటర్‌ రూ.200కు చేరితే బైక్‌పై ముగ్గురికి అనుమతి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.!

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపై అసోం బీజేపీ అధ్యక్షుడు భాబేష్ కలిట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు లీటర్ రూ.200కు పెరిగితే బైక్‌పై ముగ్గురిని ప్రయాణించేందుకు అనుమతిస్తామని భాబేష్ కలిట కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలాగే పెరిగితే బైక్‌లపై ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. తముల్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాబేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

భబేష్‌ చవకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన వ్యాఖ్యలు సీరియస్‌గా మాట్లాడారా... లేక సరదా కోసం మాట్లాడారా అన్నది స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నేత చీఫ్‌ బొబ్బీట శర్మ నిలదీశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల.. భాబేష్‌కు ఎలాంటి స్పృహ లేదని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. పెట్రో, నిత్యావసరాల ధరల పెరగడంతో సామాన్యులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయని, అయినా పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతోందని విమర్శించారు. అచ్చే దిన్‌ అంటే ఇదేనా అంటూ బీజేపీని కాంగ్రెస్‌ నేత నిలదీశారు. మంగళవారం అస్సాంలో పెట్రోల్, డీజిల్ ధరలు. 101.97 మరియు .4 94.43 వద్ద ఉన్నాయి.

Next Story