గురువారం నుంచి అసోంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు పిడుగులు, తుఫానుల కారణంగా ముగ్గురు యువకులతో సహా కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు శనివారం తెలిపారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 48 గంటల్లో 12 జిల్లాల్లో తుఫానులు, వర్షాలు, మెరుపులు 592 గ్రామాలలో 20,300 మందిని ప్రభావితం చేశాయని తెలిపారు.
మరణించిన ఎనిమిది మందిలో నలుగురు దిబ్రూగఢ్ జిల్లాలో, ముగ్గురు బార్‌పేటలో, ఒకరు గోల్‌పరా జిల్లాకు చెందినవారని తెలిపారు. తుఫాను కారణంగా దిబ్రూఘడ్, బార్పేట, కమ్రూప్ (మెట్రో), కమ్రూప్ (గ్రామీణ), నల్బరి, చిరాంగ్, దర్రాంగ్, కాచర్, గోలాఘాట్, కర్బీ అంగ్లాంగ్, ఉడల్‌గురి, గోల్‌పరా జిల్లాలలో 7,400 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలావుంటే.. అస్సాం, మేఘాలయలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.