గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను కలిసిన AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి బెదిరింపులు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంలో బెదిరింపులకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌లను పర్యవేక్షించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని అసదుద్దీన్ కోరారు. కొన్ని శక్తులు నన్ను అడ్డుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అలాంటి బెదిరింపులకు నేను భయపడను. అలాంటి బెదిరింపులకు భయపడేది లేదు.. మీ తండ్రి వచ్చినా కూడా నన్ను అడ్డుకోలేరంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది.
విలేకరులతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. దేశంలో దుష్టశక్తులకు ప్రస్తుతం బలం ఉందని అన్నారు. ఎవరూ కలకాలం బతకలేరని.. ఆ బహిరంగంగా ఇలాంటి బెదిరింపులు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని అసదుద్దీన్ అన్నారు. తాము ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు అసదుద్దీన్. ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని ముఖ్తార్ అన్సారీ నివాసానికి ఒవైసీ వెళ్లారు. ఓ క్రిమినల్ కు మద్దతు ఇస్తావా అంటూ కొందరు సోషల్ మీడియాలో అసదుద్దీన్ పై బెదిరింపులకు దిగారు.