గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీఎం కేజ్రీవాల్ రేపు తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది

By Medi Samrat  Published on  16 Sept 2024 4:34 PM IST
గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీఎం కేజ్రీవాల్ రేపు తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. "ముఖ్యమంత్రి మంగళవారం లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది" అని పార్టీ సోమవారం తెలిపింది. రెండు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.

సీఎం కేజ్రీవాల్ ఆదివారం ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తనకు నిజాయితీగా సర్టిఫికెట్ ఇచ్చే వరకూ సీఎం కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. దేశ రాజధానిలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పీఏసీ సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. సీఎం నివాసంలో జరగనున్న ఈ భేటీలో సీఎం అభ్య‌ర్థిపై చర్చ జరగనుంది. దీంతో పాటు మంగళవారం శాసనసభా పక్ష సమావేశం కూడా జరగనుంది. ఈరోజు ఉదయం మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు.

Next Story