కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దమ్ముంటే యమునా నీటిని తాగాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. కేజ్రీవాల్ యమునా నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపించారు. పొరుగున ఉన్న హర్యానా బహిరంగంగా యమునా నదిలో “విషం” కలుపుతోందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని యమునా నీటిలో 7 పార్ట్స్ పర్ మిలియన్ (PPM) వద్ద ప్రమాదకర స్థాయిలో అమ్మోనియా ఉందని చెప్పారు.
7 PPM అమ్మోనియా "విషం"తో సమానమని కేజ్రీవాల్ నొక్కిచెప్పారు. హర్యానాలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నదిని కలుషితం చేస్తోందని, ఢిల్లీ నివాసితుల జీవితాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపణలు చేశారు. "అమిత్ షా జీ, రాజీవ్ కుమార్ జీ, రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ జీ.. మీడియా ముందు 7 పీపీఎం అమ్మోనియా ఉన్న ఈ నీళ్లను తాగి మాకు చూపించండి." అని అన్నారు. ఢిల్లీకి 7 పీపీఎం ఉన్న నీళ్లు పంపి కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతున్నారని నిందలు మోపుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.