సత్యేందర్ జైన్‌ను కలిసిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal meets ailing Satyendar Jain at LNJP Hospital. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో

By Medi Samrat  Published on  28 May 2023 3:56 PM IST
సత్యేందర్ జైన్‌ను కలిసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను కలిశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆసుపత్రికి చేరుకుని సత్యేందర్ జైన్ ను ఆత్మీయంగా ద‌గ్గ‌రికి తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యేంద్ర జైన్ ను ఆరోగ్య ప‌రిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం కేజ్రీవాల్‌. సమావేశం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు నేను నేటి యుగానికి హీరో అయిన ఒక ధైర్యవంతుడిని కలిశాను అని రాసుకొచ్చారు.

సత్యేందర్ జైన్ బుధవారం తీహార్ జైలు బాత్రూంలో కుప్పకూలిపోయారు. తల తిరగడంతో కిందపడిపోయిన‌ట్లు స‌మాచారం. దీంతో జైలు అధికారులు ఆయ‌న‌ను.. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమించడంతో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తర‌లించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయనకు ఆరు వారాల‌ బెయిల్‌ను మంజూరు చేసి ఊర‌టనిచ్చింది.


Next Story