ముంబైలో అనుమానాస్పద బోటులో కనిపించింది వారే..!

మంగళవారం తెల్లవారుజామున భారతీయ తీరంలోకి ప్రవేశించిన బోట్ గురించి హై అలర్ట్ చేశారు అధికారులు.

By Medi Samrat  Published on  8 Feb 2024 5:45 PM IST
ముంబైలో అనుమానాస్పద బోటులో కనిపించింది వారే..!

మంగళవారం తెల్లవారుజామున భారతీయ తీరంలోకి ప్రవేశించిన బోట్ గురించి హై అలర్ట్ చేశారు అధికారులు. సౌదీ అరేబియా-దుబాయ్-పాకిస్తాన్ మార్గంలో ఫిషింగ్ బోట్‌లో కువైట్ నుండి ముంబైకి 10 రోజుల పాటు ప్రయాణించారు ఓ ముగ్గురు. టార్చర్ పెట్టే యజమాని వ‌ద్ద నుంచి.. సౌదీ నుండి తమిళనాడు వాసులు పారిపోయి వచ్చారని కొలాబా వాసులు గుర్తించారు. పోలీసులు వారిని బుధవారం అరెస్టు చేశారు. బోటు జీపీఎస్‌ను పరిశీలించి మార్గాన్ని ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విజయ్ వినోద్ ఆంథోనీ (29), అనిష్ (29), నిడిసో డిట్టో (31)లను ఫిబ్రవరి 10 వరకు పోలీసు కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. వారు కువైట్‌లో ఏదైనా నేరం చేశారా లేదా అంతర్జాతీయ సరిహద్దులు దాటుతున్నప్పుడు ఎలాంటివి చేశారు అనే విషయమై విచారణ చేస్తున్నారు. నిందితులు వచ్చిన పడవలో ఎటువంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు.

ఆ ముగ్గురు ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ కు వెళ్లారు. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వినయ్ విజయ్ ఆంటోనీ తో కలిసి నిడిసో డిటో, సహయత్త అనీశ్ లు అక్కడ యజమాని పెట్టే చిత్రహింసలకు తాళలేక తప్పించుకుని సముద్ర మార్గం గుండా స్వదేశానికి చేరుకున్నారు. అబ్దుల్లా షర్హీద్ అనే వ్యక్తికి చెందిన ఫిషింగ్ కంపెనీలో చేరారు. ఆ యజమాని పని చేయించుకుని సరిగా జీతం చెల్లించకపోగా చిత్రహింసలకు గురిచేశాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నించారు. పాస్ పోర్టులు షర్హీద్ వద్ద ఉండడం వల్ల అధికారికంగా రాలేకపోయారు. చివరకు యజమాని పడవ దొంగలించి, పది రోజుల పాటు ఆరు దేశాల గుండా ప్రయాణించి ముంబయికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్తున్నామని చెప్పి 6 వేల లీటర్ల డీజిల్ ను నింపి పడవను ఎత్తుకొచ్చారు. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్థాన్ మీదుగా ప్రయాణించి భారత తీరానికి చేరుకున్నారు.

Next Story