'ఆపరేషన్ మహాదేవ్'.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే.?

జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది

By Medi Samrat
Published on : 28 July 2025 6:16 PM IST

ఆపరేషన్ మహాదేవ్.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే.?

జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు. ఈ ఎన్‌కౌంటర్ ప్రదేశం జబర్వన్-మహదేవ్ పర్వతాల మధ్య ఉంది. ఈ ఆపరేషన్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి.

రెండు రోజుల క్రితం దచిగామ్ అడవిలో ఆర్మీ అనుమానాస్పద సమాచార మార్పిడిని ట్రాక్ చేసిందని, ఆ తర్వాత ఆపరేషన్ ప్రారంభించామని వర్గాలు తెలిపాయి. ఓవైపు పార్లమెంట్ లో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతుండగా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరగడం, అదికూడా పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత జరుగుతోంది.

Next Story