ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం.. ఒకరు దాహాం అంటూ.. ప్ర‌త్య‌క్ష స్యాక్షులు ఏమన్నారంటే.!

Army helicopter crash .. screams, cries for help .. eyewitnesses say. బుధవారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్‌ ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలడాన్ని కొండ గ్రామాల్లో నివసిస్తున్న కొందరు గమనించారు.

By అంజి  Published on  9 Dec 2021 2:06 PM IST
ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం..  ఒకరు దాహాం అంటూ.. ప్ర‌త్య‌క్ష స్యాక్షులు ఏమన్నారంటే.!

బుధవారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్‌ ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలిన విషయం తెలిసింది. ఈ ఘోర ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన భార్య, 12 మంది సైనిక అధికారులు మరణించారు. ఈ విషాద ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు సాయి తేజ ఉన్నారు. ఘటనా స్థలిలో హెలికాప్టర్‌ కుప్ప కూలడాన్ని కొండ గ్రామాల్లో నివసిస్తున్న కొందరు గమనించారు. ప్రమాదాన్ని చూసిన గ్రామస్తుల్లో కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారు. వెంటనే వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల్లో ఒకరైన చంద్రకుమార్‌ అనే గ్రామస్తుడు మాట్లాడారు. ఆర్మీ హెలికాప్టర్‌ కూలగానే భారీ శబ్దం వినిపించిందని, ఆ సమయంలో తాను ఇంట్లో ఇంట్లో ఉన్నానని చెప్పారు. ఇంటి బయటకు వచ్చి చూడగా దట్టమైన పొగలు అలుముకుని ఉన్నాయని, వెంటనే దగ్గరకు వెళ్లి చూశానన్నారు. చెట్ల కొమ్మలపై హెలికాప్టర్‌ చిక్కుకుందని, భారీగా మంటలు ఎగసిపడ్డాయని తెలిపారు. ఆ సమయంలోనే హెలికాప్టర్‌లో ఉన్న కొందరు కాపాడాలని గట్టిగా అరిచారని, తనకు ఏం చేయాలో తెలియక వెంటనే పక్కింట్లో ఉండే శివకుమార్‌ను పిలిచానని చెప్పాడు.

మ‌రో ప్ర‌త్య‌క్ష సాక్షి శివ‌కుమార్ అనే గ్రామస్తుడు మాట్లాడారు. హెలికాప్టర్‌ కూలిన విషయం తెలియగానే తాను వెంటనే పోలీసులకు సమాచారం అందించానని అన్నారు. అయితే వాళ్లు రావడానికి సమయం పడుతుందని, తాను 8 మంది గ్రామస్తులతో కలిసి ప్రమాద ఘటన స్థలానికి వెళ్లానన్నారు. ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలిలో పొదల్లో పడి ఉన్నారని, వారు బహుశా హెలికాప్టర్‌ నుంచి దూకి ఉండవచ్చని అన్నారు. తాను వారి దగ్గరికి వెళ్లి చూస్తే వారి బట్టలు పూర్తిగా కాలిపోయాయని, వారిలో ఒకరు దాహంగా ఉంది.. తాగడానికి నీరు కావాలని అడిగాడని చెప్పారు. తాను అతడికి ఏమీ కాదని చెప్పానని, తప్పకుండా సహాయం చేస్తామన్నాను. అయితే అది కొండ ప్రాంతం కావడంతో వారిని చాలా దూరం మోసుకొని వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఘటనా స్థలికి పోలీసులు వచ్చాక.. అక్కడికి ఎవరినీ అనుమతించలేదని, స్థానికులను ఇళ్లలోనే ఉండాలని చెప్పారని తెలిపారు.

Next Story