బుధవారం ఊటీలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. హెలికాప్టర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుండి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ హెలికాప్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఐఏఎఫ్ ధృవీకరించింది. ఇప్పటి వరకు ముగ్గురు అధికారులను రక్షించామని, మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు. క్షతగాత్రులను నీలగిరిలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్‌కు తరలించారు. ఊటీలో బుధవారం జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా సీనియర్ డిఫెన్స్ అధికారులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ వద్ద కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. 14 మంది సీనియర్ రక్షణ శాఖకు చెందిన అధికారులు విమానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు అధికారులు రక్షించబడ్డారని ఒక అధికారి తెలిపారు. క్షతగాత్రులను నీలగిరిలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్‌కు తరలించారు. ఎంఐ సిరీస్ ఛాపర్‌లో బిపిన్ రావత్‌తో పాటు ఆయన సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. హెలికాప్టర్ క్రాష్ అయిన వెంటనే, సమీపంలోని స్థావరాల నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు వర్గాలు ధృవీకరించాయి.