కరోనాతో మరో సింహం మృతి.. రోజుల వ్య‌వ‌ధిలో రెండో మ‌ర‌ణం

Another lion dies at Chennai zoo due to Covid-19. మ‌రో సింహం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మృతిచెందింది. త‌మిళ‌నాడు రాష్ట్రం

By Medi Samrat
Published on : 16 Jun 2021 7:24 PM IST

కరోనాతో మరో సింహం మృతి.. రోజుల వ్య‌వ‌ధిలో రెండో మ‌ర‌ణం

మ‌రో సింహం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మృతిచెందింది. త‌మిళ‌నాడు రాష్ట్రం వండ‌లూర్‌లోని అరైన‌ర్ అన్నా జూలాజిక‌ల్ పార్కులో ఏసియాటిక్ మ‌గ సింహం ప‌ద్మ‌నాథ‌న్ (12) గ‌త కొన్ని రోజులు క్రితం క‌రోనా బారిన ప‌డింది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం ఉద‌యం ప్రాణాలు విడిచింది. దీంతో క‌రోనా కార‌ణంగా ఈ జూ లో మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.

ఇదే జూలోని నీలా (9) అనే ఆడ సింహం ఈ నెల 3న క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందింది. అదేరోజు జూ లోని మిగ‌తా సింహాల‌కు కూడా క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మొత్తం తొమ్మిది సింహాల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి జూ నిర్వ‌హ‌కులు వాటికి ప్ర‌త్యేకంగా చికిత్స అంద‌జేస్తున్నారు. వాటిలో మూడు సింహాల ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌గా.. ఓ సింహం ఈ రోజు ఉద‌యం మృతిచెందింది.




Next Story