ఇడ్లీ అమ్మకు.. ఇంటిని బహుమతిగా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra gifts new house to Tamil Nadu’s Idli Amma on Mother’s Day. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనకు వీలైనంత మందికి సహాయం చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే

By Medi Samrat
Published on : 8 May 2022 6:54 PM IST

ఇడ్లీ అమ్మకు.. ఇంటిని బహుమతిగా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనకు వీలైనంత మందికి సహాయం చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే..! అద్భుతమైన ట్యాలెంట్ చూపించే వారి కోసం, సమాజంలో గొప్ప పనులు చేసే వారికి ఆనంద్ మహీంద్రా సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరో గొప్ప పని చేసి చూపించారు. తమిళనాడుకు చెందిన 'ఇడ్లీ అమ్మ'గా పిలవబడే వృద్ధురాలికి ఓ ఇంటిని బహుమతిగా ఇవ్వడం విశేషం. గతంలో ఇడ్లీ అమ్మ గొప్పతనం గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ వయసులో కూడా తక్కువ ధరకే ఎంతో మంది కడుపు నింపుతూ ఉందని ఆనంద్ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు.

ఆనంద్ మహీంద్రా 2021 ఏప్రిల్‌లో ఒక ట్వీట్‌ను షేర్ చేసారు. ఇడ్లీ అమ్మ వండిన ఆహారాన్ని ప్రజలకు అందించడాన్ని ఆ ట్వీట్ లో చూడొచ్చు. ఆమె త్వరలో తన స్వంత ఇంటిని కలిగి ఉంటుందని అప్పట్లో ఆనంద్ మహీంద్రా చెప్పారు. చెప్పినట్లుగానే ఆమెకు ఇంటిని అందించారు ఆనంద్ మహీంద్రా. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా 'ఇడ్లీ అమ్మ' తన కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేశారు. మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు తమ నుండి బహుమతిని ఇచ్చామని, సకాలంలో ఆమెకు ఇంటిని అందించడానికి కృషి చేసిన మా బృందానికి చాలా కృతజ్ఞతలని తెలిపారు. అంతేకాకుండా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు! అని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.










Next Story