రాజస్థాన్‌లో మళ్లీ భూకంపం

An earthquake with a magnitude of 4.6 on the Richter Scale hit Jalore. రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో జలోర్‌లో స్వల్ప భూకంపం సంభవించినట్లు

By అంజి
Published on : 20 Nov 2021 8:26 AM IST

రాజస్థాన్‌లో మళ్లీ భూకంపం

రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో జలోర్‌లో స్వల్ప భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. కాగా భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.6గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం. జోధ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. జోధ్‌పూర్‌లో గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు భూకంపం సంభవించింది.

Next Story