ధరలు పెంచిన ప్రముఖ పాల కంపెనీ

Amul increases price of milk by Rs 2 per litre. ప్రముఖ పాల ఉత్ప‌త్తుల సంస్థ‌ అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు

By Medi Samrat  Published on  28 Feb 2022 5:51 PM IST
ధరలు పెంచిన ప్రముఖ పాల కంపెనీ

ప్రముఖ పాల ఉత్ప‌త్తుల సంస్థ‌ అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. గోల్డ్, తాజా, శక్తి, టి-స్పెషల్.. ఆవు, గేదె అన్ని పాల రకాల ధరలు పెంచుతున్న‌ట్లు తెలిపింది. పెరిగిన ధరల ప్ర‌కారం.. అమూల్ గోల్డ్ పాల ధర 500 ఎంఎల్‌ రూ. 30 అవుతుంది.. అమూల్ తాజా 500 ఎంఎల్‌ రూ. 24, అమూల్ శక్తి 500 ఎంఎల్‌ రూ. 27కు అందుబాటులో ఉంటాయి. అమూల్ సంస్థ‌ దాదాపు 7 నెలల 27 రోజుల విరామం తర్వాత పాల ధరను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. చివరిగా జూలై, 2021 నెలలో రూ. లీటరుకు 2 పెంచింది. ఇక‌ మహాశివరాత్రి సందర్భంగా అమూల్ తన వినియోగదారులకు ఒక‌రోజు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది. పాల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలు పాల ఉత్పత్తిదారులకు బదిలీ చేయాలనేది కంపెనీ విధానం.. కాబట్టి ధర పెరుగుదల పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.



Next Story