పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సోహ్నా, మోహనా అనే కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో ఉద్యోగం సంపాదించారు. 19 ఏళ్ల కవల పిల్లలు డిసెంబర్ 20న ఉద్యోగంలో చేరారు. తమకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పంజాబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని సోహ్నా-మోహ్నా తెలిపారు. "మేము ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఉద్యోగంలోకి డిసెంబర్ 20న చేరాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వానికి, మాకు విద్యాబోధన చేసిన పింగల్వారా సంస్థకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము" అని కవలలు మీడియాకు చెప్పారు.
కవలలు సప్లై కంట్రోల్ రూమ్‌లో పని చేయనున్నారు. "ఇక్కడ ఎలక్ట్రికల్ ఉపకరణాలను చూసుకోవడానికి సోహ్నా-మోహ్నా మాకు సహాయం చేయనున్నారు. పంజాబ్ ప్రభుత్వం వారిని నియమించుకుంది. సోహ్నాకు ఉద్యోగం వచ్చింది. మోహ్నాతో వారికి సహాయం చేస్తాడు. ఈ పనిలో వారికి అనుభవం కూడా ఉంది," అని PSPCL సబ్‌స్టేషన్ జూనియర్ ఇంజనీర్ రవీందర్ కుమార్ తెలిపారు. అవిభక్త కవలలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.