పేషెంట్ ను తీసుకొని వస్తుండగా అంబులెన్స్ లో ఇంధనం అయిపోయింది.. ఆ తర్వాత..

Ambulance Carrying Patient Ran Out Of Fuel. రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా శనివారం సాయంత్రం బిజ్నోర్‌ నుంచి

By Medi Samrat
Published on : 3 April 2022 9:30 PM IST

పేషెంట్ ను తీసుకొని వస్తుండగా అంబులెన్స్ లో ఇంధనం అయిపోయింది.. ఆ తర్వాత..

మీరట్‌ (ఉత్తరప్రదేశ్‌): రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా శనివారం సాయంత్రం బిజ్నోర్‌ నుంచి మీరట్‌ వైపు వెళుతుండగా దారిలో అంబులెన్స్ లో ఇంధనం అయిపోయింది. గ్రామానికి చెందిన స్థానికులు అంబులెన్స్‌ను సమీపంలోని పెట్రోల్ బంకు దాకా తీసుకుని వెళ్ళడానికి తాడుతో ట్రాక్టర్‌కు కట్టారు. ఈ విషయం తెలియగానే జిల్లా అధికార యంత్రాంగంలో కలకలం రేగింది.

మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేష్ మోహన్ ఈ సంఘటనపై మాట్లాడుతూ "అంబులెన్స్ మీరట్ కు చెందినది కాదు. బిజ్నోర్ నుండి మీరట్‌కు వస్తుండగా అంబులెన్స్ లో ఇంధనం అయిపోయింది" అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్ ల నిర్వహణ సరిగా లేకపోతే ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాలు వైద్య ఆరోగ్య శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.

Next Story