తీవ్ర నిరాశ‌లో న‌గ్మా.. సోనియా గాంధీపై వ్యాఖ్యలు

Am I Less Deserving Congress's Nagma On Being Denied Rajya Sabha Seat. నగ్మా.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.

By Medi Samrat  Published on  30 May 2022 8:45 AM GMT
తీవ్ర నిరాశ‌లో న‌గ్మా.. సోనియా గాంధీపై వ్యాఖ్యలు

నగ్మా.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నారు. ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా పలు రాష్ట్రాల్లో ప్రచారం కోసం వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే తాజాగా నటి నగ్మా ఆశించిన రాజ్యసభ సీటు ఆమెకు దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నగ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్య సభ సీటు కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం కల్పిస్తానని చెప్పారని, ఇప్పటి వరకు ఆ అవకాశమే రాలేదా అంటూ ప్రశ్నించారు. వచ్చేనెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో నగ్మకు అవకాశం దక్కకపోవడంతో సోషల్ మీడియా వేదికగా "SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren't in power thn.Since then it's been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving" పోస్ట్ పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సీటును ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.












Next Story