కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరుకు చేరుకోమని ఆదేశాలు

All Congress MLAs have been directed to reach Bangalore. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత హైడ్రామా మొదలైంది.

By Medi Samrat
Published on : 13 May 2023 10:54 AM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరుకు చేరుకోమని ఆదేశాలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత హైడ్రామా మొదలైంది. రేపు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి పిలుపునిచ్చింది. రేపు బెంగళూరు చేరుకోవాలని ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరింది. కర్ణాటక రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఆర్‌.అశోక వెనుకంజలో ఉన్నారు. బీజేపీ సీనియర్‌ నేత, లింగాయత్‌ నాయకుడు యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర శికారిపుర సీటులో వెనుకంజలో ఉన్నారు. గంగావతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జనార్ధన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలోని 6 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్ లో ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.


Next Story