algospeak.. అనే కొత్త పదాన్ని తీసుకుని వచ్చిన శశి థరూర్

'Algospeak' is Shashi Tharoor's Word of the Day. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఆంగ్ల పదజాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందారు.

By Medi Samrat  Published on  21 July 2022 12:56 PM GMT
algospeak.. అనే కొత్త పదాన్ని తీసుకుని వచ్చిన శశి థరూర్

కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఆంగ్ల పదజాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందారు..ఆయన మాటల కారణంగా.. ఒక్కోసారి ఆ పదాలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ప్రజలు తరచుగా డిక్షనరీలను ఉపయోగిస్తూ ఉంటారు. గురువారం ఆయన "#WordOfTheDay" అని పిలిచే మరొక పదాన్ని పంచుకున్నారు.

కొత్త పదం "అల్గోస్పీక్." ("algospeak") గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. "unsuitable or inappropriate, in order to bypass downranking by content moderation filters on social media platforms," అని కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేశారు. అటువంటి పదానికి ఉదాహరణ ఇస్తూ.. థరూర్ "Eg. using "unalive" rather than "dead." అని చెప్పుకొచ్చారు.

ఈ సంవత్సరం మేలో, థరూర్ "వర్డ్ ఆఫ్ ది ఎరా" - "డూమ్‌స్క్రోలింగ్"తో ముందుకు వచ్చారు. అంటే చెడు వార్తలను నిరంతరం వెతకడం, చదవడం. థరూర్ తన టంగ్ ట్విస్టర్ లో "క్వోమోడోక్యున్‌క్వైజ్"తో రైల్వే మంత్రిత్వ శాఖపై విరుచుకుపడ్డారు.













Next Story