యూజర్లకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా రిచార్జ్ ధరలను ఎయిర్‌టెల్ ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. డాటా టాప్ అప్ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం, ప్రీపెయిడ్ రిచార్జ్‌ల కింద 20 నుంచి 25 శాతం పెంచింది. ఈ నెల 26 నుండి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. అయితే అదే టైమ్‌లో ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతి రోజూ 500 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రతి రోజు ఉచితంగా వచ్చే 500 ఎంబీ డేటాను పొందాలనుకుంటే మీరు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.265, రూ.299, రూ.719, రూ.839 వంటి ప్రీఫెయిడ్ ప్లాన్‌లను మీ నంబర్‌పై రీచార్జ్ చేసుకుంటే.. ప్రతి రోజు ఉచితంగా 500 ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే ఇది సెలెక్టర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 జీబీ డేటా 84 రోజులు, రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజులు, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ డేటా 28 రోజుల పాటు పొందవచ్చు. ఉచిత డేటాను పొందాలంటే ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ కొత్తగా పెంచిన ధరలు ఇలా ఉన్నాయి. రూ.79 ప్లాన్ ధరను రూ.99కి చేరింది. దీనికి 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రూ.99 టాక్‌టైమ్, 200 ఎంబీ డేటా, సెకన్ పర్ పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్‌కు సంబంధించి రూ.149 ధరను రూ.179కి చేరింది. రూ.2,498 ప్లాన్ రూ.2,999గా పెంచింది. దీంతో పాటు డేటా టాప్ ధరలు కూడా పెరిగాయి.