వాషింగ్టన్‌కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం

ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat
Published on : 11 Aug 2025 8:01 PM IST

వాషింగ్టన్‌కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం

ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- వాషింగ్టన్ డి.సి. మధ్య ప్రత్యక్ష విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఆపరేషనల్ పరిమితుల కారణంగా ఈ మార్గంలో నాన్-స్టాప్ సేవలను నిలిపివేయాల్సి వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దాదాపు 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రిట్రోఫిటింగ్ చేస్తున్న నేపథ్యంలో విమానాల కొరత ఎదురవుతుందన్నారు.

విమానాల కొరత వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గడచిన నెలలోనే 26 బోయింగ్ 787-8 విమానాలపై రిట్రోఫిటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొంది. అయితే కెనడా నగరాలైన టొరంటో, వాంకోవర్‌తో సహా ఆరు ఉత్తర అమెరికా గమ్యస్థానాల మధ్య నాన్-స్టాప్ విమానాలను నిర్వహిస్తామని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.

Next Story