ఎయిర్ ఇండియా బిడ్ ను సొంతం చేసుకున్న టాటా సన్స్

Air India goes to Tata Group for Rs 18,000 crore. ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్‌ ఇండియాను కేంద్రం

By Medi Samrat  Published on  8 Oct 2021 12:15 PM GMT
ఎయిర్ ఇండియా బిడ్ ను సొంతం చేసుకున్న టాటా సన్స్

ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్‌ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్‌ జెట్‌తో పాటు ఎయిర్‌ ఇండియా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం టాటా సన్స్‌ కు ఇవ్వడానికి అంగీకరించింది. ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్‌ రూ. 18,000 కోట్లను ఇవ్వనుంది. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే అధికారికంగా టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా వెళ్ళిందంటూ ప్రకటించారు.

ఇక స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. అప్పటి నుండి ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది. ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో వేలంపాట నిర్వహించడానికి బిడ్స్ కూడా వేశారు. 2020 మార్చి 31 నాటికి ఎయిరిండియాకు దాదాపు రూ. 45,863.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఎయిరిండియాను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ. 20 కోట్ల భారం పడుతోంది. ఎయిర్‌ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టగా అప్పట్లో ఎవరూ కొనలేదు. ఈసారి వంద శాతం వాటాలను విక్రయించగా.. టాటా సన్స్ సొంతం చేసుకుంది.


Next Story