రాహుల్ గాంధీ కుక్క పేరుపై ఎంఐఎం నేతల గుస్సా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు

By Medi Samrat  Published on  6 Oct 2023 7:00 PM IST
రాహుల్ గాంధీ కుక్క పేరుపై ఎంఐఎం నేతల గుస్సా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆ పెంపుడు కుక్క పిల్లకు నూరీ అని పేరు పెట్టారు. అయితే ఈ పేరుపైనే ఎంఐఎం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒక పెంపుడు కుక్క పిల్లకు నూరీ అని పేరు పెట్టడం ఇస్లాం మతాన్ని అవమానించడమేనని ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ అధికార ప్రతినిధి మహ్మద్ ఫర్హాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒక కుక్కకు నూరీ పేరు పెట్టడం ద్వారా ఇస్లాం మతంలోని లక్షలాది మంది బాలికలను రాహుల్ గాంధీ అవమానించారని మహ్మద్ ఫర్హాన్ విమర్శించారు. ఆ నూరి అనే కుక్క పిల్ల జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందినది. దాన్ని ఈ ఏడాది ఆగస్టులో గోవాలో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇటీవల వరల్డ్ యానిమల్ డే రోజున ఆ కుక్క పిల్లను తన తల్లి సోనియా గాంధీ దగ్గరకు తీసుకువెళ్లారు.

Next Story