ప్రధాని మోదీ పర్యటన.. పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ వైఫల్యం
After PM Stuck On Flyover, BJP Says Chief Minister Channi Ignored SOS. ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పంజాబ్ పర్యటనను రద్దు చేసుకోవడం సంచలనం
By Medi Samrat Published on 5 Jan 2022 5:39 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పంజాబ్ పర్యటనను రద్దు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సెక్యూరిటీ కారణాల వలన పర్యటన రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. భఠిండా నుంచి రోడ్డు మార్గాన ఫిరోజ్‌పూర్ వస్తుండగా ఓ ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులు ట్రక్కులు అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్ చేశారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అక్కడే ప్రధాని 15 నుంచి 20 నిమిషాలు వేచి చూశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వెనుదిరిగి భఠిండా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు. భద్రతా లోపాలపై వెంటనే నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి కాలంలో భారత ప్రధాని భద్రతలో ఇది అతిపెద్ద లోపం ఇదేనని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రధానమంత్రికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించేందుకు ప్రధాని ఈరోజు భఠిండాలో దిగారు. రెండేళ్ల తర్వాత ప్రధాని పంజాబ్‌లో పర్యటిస్తుండగా, రైతు చట్టాల రద్దు తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఫిరోజ్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది.
పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హుస్సేనీవాలాలోని అమరవీరుల స్మారకాన్ని వద్ద నివాళులర్పించేందుకు భఠిండాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా స్మారకం వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ అధికారులు పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారం అందించారు. ఆ తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై ఉండిపోయారు. దీంతో ప్రధాని మోదీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో కాకుండా భఠిండా నుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్‌పూర్ బయల్దేరారు. ఫిరోజ్ పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ర్యాలీకి హాజరైన ప్రజలు కుర్చీలు, ప్లకార్డులు అడ్డుపెట్టుకుని ప్రధాని మోదీ రాకకోసం వేచిచూస్తున్న సమయంలో ప్రధాని మోదీ రావడం లేదని కేంద్రమంత్రి మాండవీయ స్టేజ్‌పై ప్రకటించారు.