ఏడు గంటల ప్రయాణం చేశాక తిరిగొచ్చింది.. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళుతుండగా..!

ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది.

By -  Medi Samrat
Published on : 26 March 2026 8:50 PM IST

ఏడు గంటల ప్రయాణం చేశాక తిరిగొచ్చింది.. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళుతుండగా..!

ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.ఏఐ111 విమానం గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయింది. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో అనుమానిత సాంకేతిక లోపాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రయాణికుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి పిలిపించినట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం విమానానికి నిపుణులు క్షుణ్ణంగా సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన సంస్థ, వారిని వీలైనంత త్వరగా లండన్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు హామీ ఇచ్చింది.

Next Story