ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
By - Medi Samrat |
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. చండీగఢ్‌లోని సెక్టార్-25లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా శ్మశాన వాటిక వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాజేష్ ఖుల్లార్, సుధీర్ రాజ్‌పాల్, పంకజ్ గుప్తా, డీజీపీ ఓపీ సింగ్, ఐపీఎస్ మహ్మద్ అకిల్, ఏడీజీపీ అలోక్ మిట్టల్, హర్యానా ప్రభుత్వ బ్యూరోక్రసీకి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఏడీజీపీ అంత్యక్రియలకు హాజరయ్యారు.
అంతకుముందు ఆయన మృతదేహానికి PGI లో పోస్ట్ మార్టం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం కొనసాగింది. అనంతరం మృతదేహాన్ని సెక్టార్-24లోని ప్రభుత్వ నివాసానికి తరలించారు. సెక్టార్ 25 శ్మశాన వాటికలో ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. IAS పంకజ్ అగర్వాల్, IAS రాజ్ నారాయణ్ కౌశిక్ సెక్టార్-24కి చేరుకున్నారు.
పిజిఐ చండీగఢ్ తరపున హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ పోస్ట్‌మార్టంను సక్రమంగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు అవసరమైన అన్ని విధానాలను అనుసరించింది. పోస్టుమార్టం నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారికి అందజేయనున్నారు.
చండీగఢ్‌లోని సెక్టార్ 17 నుంచి జరగాల్సిన పాదయాత్రను రద్దు చేసినట్లు 31 మంది సభ్యులతో కూడిన కమిటీ నేత రేషమ్ సింగ్ తెలిపారు. ఇందుకోసం సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కుటుంబానికి న్యాయం జరగలేదని, అయితే సామాజిక, మానవతా దృక్పథంతో పోస్టుమార్టం, అంత్యక్రియలకు నిర్ణయం తీసుకున్నామని రేషమ్ సింగ్ తెలిపారు.