పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనత పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. కాషాయ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బెంగాలీ నటి, బీజేపీ నాయకురాలు స్రవంతి ఛటర్జీ కూడా బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై బీజేపీకి ఎలాంటి చొరవ, చిత్తశుద్ధి లేదని, సరైన ప్రణాళికలు లేవని.. అందుకే తాను పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరం మార్చిన 2వ తేదీన స్రవంతి ఛటర్జీ బీజేపీలో చేరారు.
ఇదిలా ఉంటే స్రవంతి టీఎంసీలో చేరుతారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ కాలమే సమాధానం చెబుతుందన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెహలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్రవంతి.. టీఎంసీ దవిగ్గజ నేత పార్ధ ఛటర్జీ చేతిలో ఓడిపోయారు. అయితే, ఆమె కేవలం 60,000 ఓట్లను మాత్రమే సాధించి, TMC హెవీవెయిట్ ఎన్నికల్లో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రచార ర్యాలీల్లో ఆమె బీజేపీ నేతలు కైలాష్ విజయవర్గియా, దిలీప్ ఘోష్‌లతో కలిసి కనిపించారు.