సోనూ సూద్ పై కేసు నమోదు

Actor Sonu Sood Charged For Violation Of Poll Norms In Punjab. సోనూ సూద్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ

By Medi Samrat  Published on  22 Feb 2022 5:29 AM GMT
సోనూ సూద్ పై కేసు నమోదు

సోనూ సూద్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనపై మోగాలో కేసు నమోదైంది. సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఫిబ్రవరి 20న, సూద్ తన స్వగ్రామమైన మోగాలో తిరుగుతూ కనిపించారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణలపై ఆదివారం అర్థరాత్రి సోనూసూద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నైతిక ప్రవర్తనా నియమావళిని సూద్ ఉల్లంఘించారా లేదా అనే దానిపై పోలీసులు ECని సంప్రదించాలని కోరారు. పంజాబ్ పోలీసులు అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

పోలింగ్ రోజున తన సోదరి కోసం సోనూ ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు. ఆదివారం నాడు సోనూ సూద్, కొన్ని పోలింగ్ బూత్‌లలో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ సొంతంగా తనిఖీ చేయడానికి ఇంటి నుండి బయటకు వచ్చారు. అక్కడ ఓటు హక్కు లేకుండా పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించడం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు అతని సోదరి మాళవికా సూద్ సచార్ ప్రచారం చేస్తున్నట్లేనని SAD నాయకులు ఫిర్యాదు చేయడంతో సూద్‌పై చర్యలు తీసుకున్నారు.


Next Story