నటుడు సోనూసూద్‌ కీలక ప్రకటన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో..

Actor Sonu Sood announces key decision. ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇవాళ కీలక ప్రకటన చేశారు. రాబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి

By అంజి
Published on : 14 Nov 2021 12:57 PM IST

నటుడు సోనూసూద్‌ కీలక ప్రకటన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో..

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇవాళ కీలక ప్రకటన చేశారు. రాబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి మాళవిక పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారన్న అంశాన్ని సోనూసూద్‌ వెల్లడించలేదు. ప్రజలకు సేవా చేయాలన్న ఆమె లక్ష్యం సాటిలేనిదని, మాళవిక పోటీకి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం కూడా జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం అని అన్నారు. మాళవిక ఏ పార్టీ చేరుతారన్న విషయాన్ని సరైన సమయంటో ప్రకటిస్తామని తెలిపారు.

ఇవి కేవలం జనరల్ మీటింగ్స్‌ కాదని.. సిద్దాంతాలతో ముడిపడిన అంశమన్నారు. ఇటీవలే పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని సోనూసూద్‌ సోదరి మాళవిక కలిశారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ సోనూసూద్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఢిల్లీ సర్కార్‌ చేపట్టిన "దేశ్‌ కా మెంటార్స్‌" అనే కార్యక్రమానికి సోనూసూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. కొవిడ్‌ సమయంలో సోనూసూద్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మందికి ఆపన్న హస్తంలా నిలిచారు. దేశ వ్యాప్తంగా అతడు చేసిన సేవలకు ప్రజల నుండి ఆదరణ లభించింది.

Next Story