ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ కన్నుమూత‌

Actor Javed Khan Amrohi passes away. ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి మంగళవారం మరణించారు.

By Medi Samrat
Published on : 14 Feb 2023 8:31 PM IST

ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ కన్నుమూత‌
ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి మంగళవారం మరణించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 60 సంవత్సరాలు. అతను వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, చక్ దే ఇండియా, లగాన్, అందాజ్ అప్నా అప్నా వంటి చిత్రాలలో న‌టించి న‌టుడిగా మంచి గుర్తింపు పొందాడు. లగాన్‌లో త‌న‌తో కలిసి నటించిన నటుడు అఖిలేంద్ర మిశ్రా.. జావేద్ ఖాన్ మ‌ర‌ణ‌వార్తను ధృవీకరించారు. అతనితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు. ఆలస్యంగానైనా జావేద్‌కు మంచి జరగలేదని విచారం వ్య‌క్తం చేశాడు. అమ్రోహి అంత్యక్రియలు రాత్రి 7:30 గంటలకు ఒషివారా కబ్రిస్తాన్‌లో జరుగుతాయని మిశ్రా తెలిపారు.


అలాగే.. జావేద్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత ఏడాది కాలంగా మంచాన పడ్డాడు. అతను సూర్య నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు” అని చిత్రనిర్మాత రమేష్ తల్వార్ పిటిఐకి తెలిపారు. "ఆయన రెండు ఊపిరితిత్తులు విఫలమవడంతో మధ్యాహ్నం 1 గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు" అని ఆయన తెలిపారు. జావేద్ ఖాన్ సినిమాల‌తో పాటు మీర్జా గాలిబ్, నుక్కడ్ అనే టీవీ షోలలో కూడా కనిపించాడు. అత‌నికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.




Next Story