బీజేపీకి షాక్‌.. పార్టీకి న‌టి గౌత‌మి రాజీనామా

తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on  23 Oct 2023 9:29 AM IST
బీజేపీకి షాక్‌.. పార్టీకి న‌టి గౌత‌మి రాజీనామా

తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గౌతమి లేఖ ద్వారా బీజేపీ అధిష్టానానికి తెలియజేశారు. చాలా బరువెక్కిన హృదయంతో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు గౌతమి లేఖలో పేర్కొన్నారు. నా దేశ నిర్మాణ ప్రయత్నాలకు సహకరించేందుకు.. నేను 25 సంవత్సరాల క్రితం పార్టీలో చేరాను. నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. పార్టీలో నిబద్ధతతో ప‌నిచేశాను. అయితే ఈ రోజు నేను ఊహించలేని సంక్షోభంలో ఉన్నాను. పార్టీ నుంచి, నేతల నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి కొందరు మద్దతిస్తున్నారని తెలిసిందని గౌతమి లేఖలో ఆరోపించారు.


20 సంవత్సరాల క్రితం సి అళగప్పన్ అనే వ్యక్తి తనతో స్నేహం చేశాడని.. ఆమె తన ఆస్తుల నిర్వహణ బాధ్యతను త‌న‌కు అప్పగించినట్లు గౌతమి పేర్కొంది. "నేను అతనికి నా భూములను అమ్మే బాధ్యతను అప్పగించాను. అతను నన్ను మోసం చేశాడని గుర్తించాను. సుదీర్ఘ చట్టపరమైన విచారణ జరుగుతున్నప్పుడు.. తన పార్టీ తనకు మద్దతు ఇవ్వలేదని.. కొంతమంది సీనియర్ సభ్యులు అళగప్పన్‌కు సహాయం చేస్తున్నారని గ్రహించి తాను కృంగిపోయానని ఆమె పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన తర్వాత కూడా అళగప్పన్‌కు బీజేపీకి చెందిన పలువురు సీనియర్‌ సభ్యులు సహకరించారని గ్రహించడం విస్తుగొలిపే విషయం. సీఎం ఎంకే స్టాలిన్, పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఇంకా ఉందని పేర్కొన్నారు.

Next Story