నందిగ్రామ్ ట్విస్ట్.. ఓడిన మ‌మ‌తా బెన‌ర్జీ

Accept Nandigram Verdict Says Mamata Banerjee. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నిక‌ల ఫ‌లితంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది

By Medi Samrat  Published on  2 May 2021 2:38 PM GMT
నందిగ్రామ్ ట్విస్ట్.. ఓడిన మ‌మ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నిక‌ల ఫ‌లితంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మొదట ఈ స్థానంలో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గెలిచిన‌ట్లు భావించారు. కానీ చివ‌రికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలిచిన‌ట్లు తెలిసింది. మొద‌ట 1200 ఓట్ల‌తో ఇక్క‌డ మ‌మ‌త గెలిచిన‌ట్లుగా మీడియా అంతా ప్ర‌చారం చేసింది. అయితే చివ‌రికి సువేందు 1,736పైగా ఓట్లతో గెలుపొందారు.

అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. సుబేందు గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సుబేందు గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''సీఎం మమత నందిగ్రామ్‌లో ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి 1,622 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఓటమి తర్వాత మ‌మ‌త సీఎం పదవిలో కొనసాగడానికి ఏం అధికారం ఉంది.. అంటూ అమిత్ మాలవ్య ట్వీట్ చేశారు.

మరోవైపు సీఎం మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు. నందిగ్రామ్ లో ఓట‌మి గురించి చింతించ‌వ‌ద్దు. ఒక్క సీటుతో వచ్చేదేమీ ఉండదు. పోయేదేమీ ఉండదు. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తాను. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో మరిచిపోండి. మనం బెంగాల్‌ను గెలిచాం.. అంటూ మమత పేర్కొన్నారు. ఇక‌ నందిగ్రామ్ ఫలితంపై మమతా కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.
Next Story
Share it