ఉత్త‌మ సీఎంలు వీరే.. మ‌రీ కేసీఆర్‌.?

ABP Desh Ka Mood Survey. దేశంలోని అత్యుత్తమ ప‌నితీరు క‌న‌బ‌ర్చిన సీఎంల లిస్టు వ‌చ్చేసింది. ప్రముఖ జాతీయ వార్తా సంస్థ

By Medi Samrat  Published on  16 Jan 2021 3:21 AM GMT
ఉత్త‌మ సీఎంలు వీరే.. మ‌రీ కేసీఆర్‌.?

దేశంలోని అత్యుత్తమ ప‌నితీరు క‌న‌బ‌ర్చిన సీఎంల లిస్టు వ‌చ్చేసింది. ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఏబీపీ–సీఓటర్‌.. 'దేశ్‌ కా మూడ్‌' పేరుతో ఈ సర్వే చేసింది. ఈ స‌ర్వేలో మొద‌టి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ ఉన్నారు.

ఈ‌ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ 9వ స్థానంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. టాప్‌-10 జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా ఈ సర్వేను రూపొందించింది.

ఉత్త‌మ‌‌ సీఎంలు వీరే..

1) నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా

2) అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ

3) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌

4) పినరయి విజయన్‌ – కేరళ

5) ఉద్ధవ్‌ ఠాక్రే – మహారాష్ట్ర

6) భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌

7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్‌

8) శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌

9) ప్రమోద్‌ సావంత్‌ – గోవా

10) విజయ్‌ రూపానీ – గుజరాత్‌

ఇదిలావుంటే.. కేంద్ర ప్ర‌భుత్వ‌ పనితీరుతో 66 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నామ‌ని, 30 శాతం మంది సంతోషంగా లేమని సమాధానం ఇవ్వ‌గా.. నాలుగు శాతం మంది ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

ఇక ఇప్ప‌టికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు మద్దతుగా 58 శాతం మంది నిలుస్తామ‌న‌గా.. 28 శాతం మంది మాత్రం యూపీఏ వెంట ఉంటామ‌న్నారు.

అలాగే.. ప్రధానిగా ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌నేదానికి.. 55 శాతం మంది మ‌ళ్లీ మోదీనే ఎంచుకోగా, రాహుల్‌ను 11 శాతం మంది, కేజ్రీవాల్‌ను 5 శాతం మంది ఎంచుకున్నారు.


Next Story
Share it