గర్భనిరోధక మందులు లేక.. లాక్డౌన్ సమయంలో 15 శాతం మంది వివాహితలకు అవాంఛిత గర్భాలు
About 15 pc of married women could not access contraceptives during Covid lockdown last year. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో తక్కువ ఆదాయం
By Medi Samrat Published on 6 July 2021 10:10 AM GMTగత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వివాహిత మహిళలలో 15 శాతం మంది గర్భనిరోధక మందులను పొందలేకపోయారని, మహమ్మారికి ముందు శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉపయోగించిన 16 శాతం మంది మహిళలకు కొన్ని నెలల పాటు శానిటరీ ప్యాడ్‌లకు తమ అవసరాలకు తగ్గట్టుగా అందుకోలేకపోయారని సోషల్ ఇంపాక్ట్ అడ్వైజరీ గ్రూప్ డాల్బర్గ్ సంస్థ 'భారతదేశంలో తక్కువ ఆదాయ గృహాల్లోని మహిళలపై ఇంపాక్ట్స్ ఆఫ్ కోవిడ్ -19' అనే అధ్యయనాన్ని విడుదల చేసింది.
ఇది 10 రాష్ట్రాలలో దాదాపు 15,000 మంది మహిళలు మరియు 2,300 మంది పురుషుల అనుభవాలకు సంబంధించినది. ఇది మహిళలపై COVID-19 మహమ్మారి సామాజిక-ఆర్ధిక ప్రభావాలపై అత్యంత విస్తృతమైన అధ్యయనాలలో ఒకటిగా నిలిచింది. చాలా మంది మహిళలకు గర్భ నిరోధక మందులు అందుబాటులో లేవని. అలాగే 3.2 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
బిహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిపింది. ఇందులో 15 వేల మంది మహిళలు, 2,300 మంది పురుషులు పాల్గొన్నారు. వారి పరిస్థితులు, సమస్యలపై రెండు విడతలుగా.. గతేడాది మార్చి 24 నుంచి మే 31 వరకు, అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు డాల్బెర్గ్ సర్వే నిర్వహించింది. శానిటరీ న్యాప్కిన్స్, గర్భనిరోధక మందులను అందించే విషయంలో కేరళ, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు బాగా పని చేశాయి. బిహార్ 49 శాతంతో చివరి స్థానంలో ఉంది.
ఆ రెండు అందుబాటులో లేని మహిళల్లో కీలక ఆరోగ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది ఏప్రిల్-మే నెలల మధ్య 4.3 కోట్ల మంది మహిళలు ఉపాధి/ఆదాయం కోల్పోయారు. కరోనాకు ముందు ఉద్యోగులైన 7.6 కోట్ల మందిలో 57శాతం మంది ఉపాధి కోల్పోయారు. చెల్లింపుల విషయంలో పురుషులతో పోల్చుకుంటే మహిళలు జీతభత్యాలు నెమ్మదిగా పొందుతున్నారు. జీతాలు చెల్లించని మహిళలు 43 శాతం ఉంటే.. పురుషులు 35 శాతమే ఉన్నారు. మహమ్మారికి ముందు 24 శాతం మంది మహిళలు పని చేసేవారు. కరోనా కారణంగా వారిలో 28 శాతం మంది ఉపాధి కోల్పోయారు.