విజయ యాత్రలు ప్లాన్ చేసిన ఆప్.. మొద‌ట‌గా అక్క‌డికి వెళ్లి..

AAP’s victory marches in all Punjab districts to begin from Amritsar today. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

By Medi Samrat  Published on  13 March 2022 12:31 PM IST
విజయ యాత్రలు ప్లాన్ చేసిన ఆప్.. మొద‌ట‌గా అక్క‌డికి వెళ్లి..

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ మెజారిటీని సాధించగా.. ఆ పార్టీ గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గోవాలో 40 సీట్లలో 20 స్థానాలు గెలుచుకుంది. మరో ముగ్గురు గెలిచిన అభ్యర్థుల మద్దతు ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం గవర్నర్‌ను కలిశారు. ఇక హోలీ తర్వాతే ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉండగా.. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ కొనసాగుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికలలో పార్టీ విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ముందుగా వీరు ఇరువురు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అనంత‌రం కేజ్రీవాల్‌తో కలిసి భగవంత్ మన్ నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈరోజు ఉద‌యం అమృత్‌సర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వారికి స్వాగతం పలికారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గోల్డెన్ టెంపుల్‌లో ప్రార్థనలు చేసి.. ఈరోజు నగరంలో విజయోత్సవ రోడ్‌షో నిర్వహించనున్నారు. పంజాబ్‌లో 92 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. ఇప్పుడు అఖండ విజయానికి గుర్తుగా సంబరాలు చేసుకుంటోంది. ఈరోజు నుండి పార్టీ అన్ని జిల్లాల్లో విజయ యాత్రలను ప్లాన్ చేసింది.










Next Story