స‌రైన సమయంలో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం

AAP to announce Gujarat chief ministerial candidate at apt time. గుజ‌రాత్‌లో ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును సరైన సమయంలో ప్రకటిస్తుందని

By Medi Samrat
Published on : 24 Sept 2022 8:54 AM

స‌రైన సమయంలో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం

గుజ‌రాత్‌లో ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును సరైన సమయంలో ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. మనీష్ సిసోడియా ఉత్తర గుజరాత్‌లో పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఉంఝా పట్టణంలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. తగిన సమయంలో పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని చెప్పారు.

ప్రజలను ఉద్దేశించి సిసోడియా మాట్లాడుతూ.. "గుజరాత్ ప్రజలకు సేవ చేయడానికి మనం నాయకులుగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు, నాణ్యతను మెరుగుపరచాలి, ఇది ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ఉండాలి. AAP ఢిల్లీలో ఆ పని చేసి ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆప్ విధానం చాలా స్పష్టంగా ఉంది. ప్రజా నిధులు ప్రజల అభ్యున్నతికి ఉపయోగించాలి. ఎంపిక చేసిన కొద్దిమంది స్నేహితుల కోసం కాదు అని బీజేపీపై ఎదురుదాడి చేశారు. ఆదివారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలో పర్యటించి పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.


Next Story