పార్టీ నాయకత్వం కోట్లకు టిక్కెట్లను అమ్ముకుంది : ఆప్ కార్యకర్తలు

AAP selling tickets for crores. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న నేఫ‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోట్

By Medi Samrat  Published on  11 Jan 2022 3:44 PM IST
పార్టీ నాయకత్వం కోట్లకు టిక్కెట్లను అమ్ముకుంది : ఆప్ కార్యకర్తలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న నేఫ‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆరోప‌ణ‌లు చేసింది ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కాదు.. సాక్షాత్తు ఆప్ కార్యకర్తలు. చండీగఢ్‌లో.. పార్టీ నాయకత్వం కోట్లకు టిక్కెట్లను అమ్ముకుందని ఆరోపిస్తూ ఆప్ కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ మొహాలీ జిల్లా యూత్ సెల్ అధ్యక్షుడు గుర్తేజ్ సింగ్ పన్ను, ఉపాధ్యక్షుడు షిరా భన్బౌరా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం కరోనా బారిన పడ్డారు. మునిసిపల్ ఎన్నికలలో మెరుగైన ప్రదర్శన తర్వాత ఇటీవల చండీగఢ్‌లో విజయ యాత్ర చేపట్టారు. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత కూడా ఆయన ఎన్నికల ర్యాలీలు నిర్వహించార‌నే ఆరోపణలు వ‌చ్చాయి. సొంత పార్టీ కార్యకర్తలు విలేకరుల సమావేశాలు పెట్టి.. కోట్ల రూపాయలతో అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇదేనా వారి 'మార్పు' రాజకీయమా? అని ప్ర‌శ్నించారు. చండీగఢ్‌లో, ఆప్ కంటే తక్కువ సీట్లు ఉన్న బిజెపి మేయర్‌ని పీఠాన్ని ద‌క్కించుకుంది. దీనికి ఆప్ కార్యకర్తలు పార్టీలో ఉన్న‌ అంతర్గత కలహాలను నిందిస్తున్నారు.

ఆప్ టిక్కెట్లు అమ్ముకుంటోందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కూడా ఆరోపించింది. ఎస్‌ఎడి అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం కేసులను పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసేలా ఆదేశించాలన్నారు. ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకుని వారికి ఓటు వేయాలని ఆప్ తన కరపత్రాల్లో ఓటర్లకు సూచించింద‌ని ఆరోపించారు. పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ తనను తాను పెద్దమనిషిగా మార్చుకుంటున్నారని స్పష్టమవుతోంద‌ని చీమా ఆరోపించారు. ఆప్ ప్రతిచోటా ఇదే త‌ర‌హా ప‌ద్ద‌తిని అవలంబిస్తోంది. ఎన్నికలలో ఎక్కడ పోటీ చేసినా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా ఇది కోట్లాది రూపాయల కుంభకోణం అని ఆరోపించారు.


Next Story