ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు కోలుకోలేని షాక్‌..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By Kalasani Durgapraveen  Published on  10 Nov 2024 4:15 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు కోలుకోలేని షాక్‌..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హర్షరణ్ సింగ్ బల్లి తన కుమారుడితో కలిసి ఆదివారం బీజేపీలో చేరారు. హర్షరణ్ కుమారుడు సర్దార్ గుర్మీత్ సింగ్ 'రింకు' బల్లి కూడా బీజేపీలో చేరారు. గుర్మీత్ ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయ‌కుడుగా ఉన్నారు.

ఆదివారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, సీనియ‌ర్ నేత‌లు సుభాష్ ఆర్య, సుభాష్ సచ్‌దేవా సమక్షంలో హర్షరన్ సింగ్ బల్లి భారతీయ జనతా పార్టీలో చేరారు. హ‌ర్‌శరణ్ సింగ్ బ‌ల్లి నాలుగు సార్లు హ‌రిన‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న బీజేపీకి చెందిన మదన్‌లాల్ ఖురానా ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. హర్షరన్ సింగ్ బల్లి జనవరి 2020లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఇదిలావుంటే.. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

Next Story