ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ప్రత్యేక లక్షణాలతో.. ఓ వింత ఆవు దూడ జన్మించింది. ఇది గ్రామస్తులలో చాలా ఉత్సుకతను రేకెత్తించింది. రైతు ఇంట్లో జెర్సీ ఆవు ఓ ప్రత్యేక దూడకు జన్మనిచ్చింది. దూడకు మూడు కళ్లు, ముక్కుకు నాలుగు రంధ్రాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు దీనిని అద్భుతంగా భావించి రైతు ఇంటి వద్దకు తరలివస్తున్నారు. అయితే పిండం సరిగా ఎదగకపోవడంతో ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ దూడకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు.. ఈ దూడను 'భోలేనాథ్' పరమశివుని స్వరూపంగా భావించి అగరబత్తులు, పువ్వులు, కొబ్బరికాయ, డబ్బు సమర్పించి పూజిస్తున్నారు. జనవరి 14వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఆవు దూడకు జన్మనిచ్చింది. మకర సంక్రాంతి కావడంతో దూడపై అందరికీ నమ్మకం పెరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లో మూడు కళ్ల దూడ ఆసక్తిని రేకెత్తించింది. రైతు హేమంత్ చందేల్ వ్యవసాయంతో పాటు ఆవులను పెంచుకుంటున్నాడు. మూడు కళ్ల దూడం జన్మించిన గ్రామం గండాయి ప్రాంతంలోని బుందేలి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది.
వింత ఆవు దూడను చూసేందుకు చాలా మంది రైతు హేమంత్ ఇంటికి క్యూ కట్టారు. ఈ విషయమై పశువైద్యుడు డాక్టర్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మూడు కళ్ల దూడ ఒక 'దైవిక అద్భుతం' అంటూ వస్తున్న మాటలను ఆయను తోసిపుచ్చారు. "ఇది పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వలన జరిగింది. నిర్ణీత సమయంలో పిండం అభివృద్ధి చెందనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అటువంటి పరిస్థితులలో దూడను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే అది తీవ్రంగా మారవచ్చు. కొన్నిసార్లు దూడ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అన్నారు.