Video : కుటుంబ సభ్యులు పనులకు వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పలిచింది.. సడెన్‌గా అత్త రావడంతో..
A shocking incident has surfaced from Kanpur
By - Medi Samrat |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రియురాలి ఇంటికి వెళ్లిన ఓ ప్రియుడు అక్కడ అడ్డంగా బుక్కయ్యాడు. వివరాళ్లోకెళితే.. శుక్రవారం కాన్పూర్‌లోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ప్రియురాలి ఇంటికి ఓ ప్రేమికుడు వెళ్లాడు. ఆ సమయంలో ప్రియురాలి అత్త తలుపు తట్టడంతో.. ఆ యువతి తన ప్రేమికుడిని పెట్టెలో దాచింది. దాదాపు 45 నిమిషాల తర్వాత పెట్టెలో శబ్ధం వినిపించడంతో.. పెట్టె తెరవమని అడగగా బాలిక కుటుంబ సభ్యులతో తలపడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాక్స్‌ను తెరవగా ఓ యువకుడు బయటకు వచ్చాడు.
చాకేరీలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. శుక్రవారం ఉదయం యువతి అన్నయ్య ట్రాక్టర్‌తో బయటకు వెళ్లగా.. తల్లి ఫ్యాక్టరీలో పనికి వెళ్లింది. ఇంతలో ఆ యువతి తన ప్రేమికుడిని ఇంటికి పిలిపించింది. కొంతసేపటికి పొరుగింట్లో ఉంటున్న యువతి అత్త ఇంటికి చేరుకుని తలుపు తట్టగా.. యువతి తలుపు తీయలేదు. అత్త యువతి సోదరుడిని, తల్లిని పిలిచింది. యువతి సోదరుడు ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఇంటికి రావడంతో తలుపులు తెరిచారు. కుటుంబ సభ్యులు యువకుడి కోసం ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలో పెట్టెలోంచి ఏదో శబ్దం వచ్చింది. పెట్టె తెరవడానికి కుటుంబ సభ్యులు యువతిని తాళం చెవి అడగడంతో ఆమె నిరసనకు దిగింది. పోలీసులు బాక్సు తెరవగా లోపలి నుంచి ప్రేమికుడు బయటకు వచ్చాడు. పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకుడిని విచారిస్తున్నట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ప్రకాష్ మిశ్రా తెలిపారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.