మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ రైల్వే స్టేషన్ రోడ్ వద్ద రివర్స్ తీస్తున్న BEST బస్సు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, BEST అధికారులు, 108 అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు