కుప్పకూలిన సొరంగం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు

A collapsed tunnel in Madhya Pradesh .. Trapped workers. మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్ప కూలింది. కాగా సొరంగంలో పలువురు కార్మికులు

By అంజి  Published on  13 Feb 2022 3:58 AM GMT
కుప్పకూలిన సొరంగం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు

మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్ప కూలింది. కాగా సొరంగంలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం నుండి ఇప్పటివరకు ఐదుగురు కార్మికులను రక్షించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. కట్నీ జిల్లాలోని స్లీమనాబాద్ వద్ద బార్గీ భూగర్భ కాలువ నిర్మాణంలో ఉన్న సొరంగంలో మొత్తం తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారని సమాచారం. జబల్పూర్ నుండి వచ్చిన రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం (ఎస్‌డీఈఆర్‌ఎఫ్‌) బృందం సహాయంతో మిగిలిన నలుగురు కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోని స్లీమనాబాద్‌లో బర్గి భూగర్భ కాలువ నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 9 మంది కూలీల్లో 5 మందిని రక్షించారు. నలుగురు కార్మికులను ఇంకా రక్షించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో ఎస్‌డిఇఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టిందని ఒక అధికారి తెలిపారు.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత కట్నీ కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా నుండి సమాచారం కోరారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని చౌహాన్ అధికారులను ఆదేశించారు. ట్విటర్‌లో మధ్యప్రదేశ్ సీఎం మాట్లాడుతూ, తాను జిల్లా యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉన్నానని, సొరంగంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు.



Next Story