2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 939 మంది పోలీసులకు పతకాలు

939 police medals announced on eve of Republic Day 2022.గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బందికి 189 శౌర్య పతకాలతో సహా మొత్తం 939 సేవా పతకాలను

By అంజి  Published on  25 Jan 2022 2:26 PM IST
2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 939 మంది పోలీసులకు పతకాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బందికి 189 శౌర్య పతకాలతో సహా మొత్తం 939 సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. శౌర్యం కోసం పోలీసు పతకం, విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం, ప్రతిభ కనబరిచినందుకు పోలీసు పతకం పొందిన సిబ్బంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అత్యధిక పతకాలను కైవసం చేసుకున్నారు. 189 శౌర్య పతకాల్లో.. 115 పోలీసు పతకాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు వారి ధైర్యం, పరాక్రమం కోసం అందించబడ్డాయి. పారామిలటరీ బలగాలలో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అత్యధికంగా 30 పతకాలను పొందగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, శాస్త్ర సీమా బాల్‌కి మూడు చొప్పున పతకాలు ఇవ్వబడ్డాయి.

సీఆర్‌పీఎఫ్‌ గ్యాలంట్రీకి 30 పోలీసు పతకాలు, విశిష్ట సేవకు ఐదు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 57 పోలీసు పతకాలు మెరిటోరియస్ సర్వీస్ కోసం అందుకోగా, ఐటీబీపీ గ్యాలంట్రీకి మూడు పోలీసు పతకాలు, విశిష్ట సేవకు మూడు రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 పోలీసు పతకాలు మెరిటోరియస్ సర్వీస్ కోసం సహా మొత్తం 18 పతకాలను అందుకుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్యాలంట్రీకి రెండు పోలీసు పతకాలు, విశిష్ట సేవకు ఐదు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, మెరిటోరియస్ సర్వీస్ కోసం 46 పోలీసు పతకాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఒక పీపీఎమ్‌, నాలుగు పీఎమ్‌లను పొందింది.

ఈ సంవత్సరం, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పోలీసు శౌర్య పతకాలలో అత్యున్నతమైనది ఎవరికీ లభించలేదు. గతేడాది జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు పోలీసులకు పీపీఎంజీ (మరణానంతరం) అందించారు. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ ఫర్ స్టేట్ పోలీసులకు కింద, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో వారి శౌర్యం కోసం మొత్తం 10 పతకాలను పొందింది. జార్ఖండ్‌కు చెందిన పోలీసు సిబ్బందికి రెండు పతకాలు, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లకు చెరో మూడు, మహారాష్ట్రకు ఏడు, మణిపూర్‌కు ఒక పతకం లభించాయి.

Next Story