త‌మ్ముడి మృత‌దేహంతో కూర్చున్న బాలుడు.. ఏం జ‌రిగిందంటే..

8-year-old boy sits by road with body of brother. ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని

By Medi Samrat  Published on  11 July 2022 3:15 PM IST
త‌మ్ముడి మృత‌దేహంతో కూర్చున్న బాలుడు.. ఏం జ‌రిగిందంటే..

ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన గంటల తరబడి కూర్చోవాల్సిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు వారి తండ్రి వాహనం కోసం వెళ్లినప్పుడు ఇలా ఆ పిల్లాడు తన తమ్ముడి శవాన్ని ఒడిలో ఉంచుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నివేదికల ప్రకారం.. పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల కొడుకు పలు వ్యాధులతో బాధపడుతున్నందున జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అనారోగ్యంతో ఉన్న కొడుకు, అతని అన్నయ్యతో కలిసి జాతవ్ మోరెనాకు అంబులెన్స్‌లో వచ్చారు, అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం తండ్రి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని సంప్రదించగా ఆసుపత్రిలో వాహనం అందుబాటులో లేదని, సొంతంగా వాహనం అద్దెకు తెచ్చుకోవాలని కోరారు. అంబులెన్స్‌కు రూ.1,500 చెల్లించేందుకు అతని వద్ద డబ్బు లేదు. దీంతో జాతవ్ తన 8 ఏళ్ల కొడుకును పార్క్ ముందు రోడ్డు పక్కన కూర్చోబెట్టి, చిన్న కొడుకు మృతదేహాన్ని ఒడిలో ఉంచి వాహనం కోసం వెతకడానికి బయలుదేరాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్వాలి పోలీసు ఇన్‌ఛార్జ్ యోగేంద్ర సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి ఒడిలో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రికి తరలించారు. చివరికి అంబులెన్స్ ఏర్పాటు చేసి, మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.










Next Story