మనుమలు, మనుమరాళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో.. ఆ వృద్ధురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లైన 45 ఏళ్లకు ఆ వృద్ధ దంపతుల మాతృత్వ కల ఫలించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వయసుల్లో తల్లి అయిన అతికొద్ది మంది మహిళ్లో జివున్‌బెన్ రబరి (70) ఒకరిగా నిలిచింది. గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన వృద్ధురాలు జివున్‌బెన్ రబరి (70), ఆమె భర్త మల్దారి (75) గత కొన్ని దశాబ్దాలుగా పిల్లల కోసం పరితపిస్తున్నారు. సంతానం కోసం ఎన్నో గుడులు, గోపురాలు తిరిగాయి. అయితే వారి కల నెరవేరలేదు. దీంతో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన రబరి తెలిపారు.
అయితే తనకు 70 ఏళ్ల వయస్సు ఉందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు తన వద్ద లేవని వృద్ధురాలు జివున్ తెలిపారు. ఏడు పదుల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన జివున్‌బెన్ రబరిపై బ్రిటన్ చెందిన 'డెయిలీ మెయిల్' ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ వయసులో పిల్లల్ని కనడం సాధ్యమయ్య పని కాదని వారికి చెప్పామని డాక్టర్ నరేష్ భానుశాలి తెలిపారు. అయితే వారి వంశంలోని వారు చాలా మంది ఆలస్యంగానే పిల్లల్ని కన్నారని తెలిపారు. ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ఇదే అత్యంత అరుదైన ఘటన అని డాక్టర్ భానుశాలి పేర్కొన్నారు.