క్లాస్‌రూమ్‌లో కౌగిలింతలు.. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్
7 Students Suspended After Their Hugging Video Goes Viral. అస్సాంలోని ఓ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో
By Medi Samrat Published on 13 Aug 2022 5:16 PM ISTఅస్సాంలోని ఓ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో అభ్యంతకరమైన పనులకు పాల్పడడంతో.. వారిని సస్పెండ్ చేశారు. కాలేజీలోని 11వ తరగతికి చెందిన బాలబాలికల బృందం క్లాస్‌రూమ్‌లో ఒకరినొకరు కౌగిలించుకొని కనిపించారు. అదే తరగతికి చెందిన మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని సిల్చార్‌లోని రామానుజ్ గుప్తా కళాశాలలో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విద్యార్థుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు కాలేజీ యాజమాన్యాన్ని కూడా తప్పుపట్టారు. ఈ వీడియోలు కళాశాల అధికారుల దృష్టికి రావడంతో ఏడుగురు విద్యార్థులను కాలేజీకి రాకుండా నిషేధించారు. ఏడుగురిలో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.
విద్యార్థులు కాలేజీలో అసభ్యకరమైన పనులకు పాల్పడ్డారని కళాశాల యాజమాన్యం వారికి నోటీసులు జారీ చేసింది. ఇటువంటి కార్యకలాపాలు క్రమశిక్షణను ఉల్లంఘించడంతో సమానమన్నారు. ఈ తప్పు చేసిన విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా సస్పెండ్ చేయబడ్డారని అందులో ఉంది. కళాశాల ప్రిన్సిపల్ పూర్ణదీప్ చందా మాట్లాడుతూ.. అధ్యాపకులు ఎవరూ లేని సమయంలో విద్యార్థులు ఈ పనికి పాల్పడ్డారు. కళాశాల ఆవరణలో CCTV కెమెరాలు ఉన్నాయి. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్లు కూడా నిషేధించారు. విద్యార్థులు 11వ తరగతికి చెందిన కొత్త బ్యాచ్‌కు చెందినవారని, వారు కళాశాలకు హాజరుకావడం ప్రారంభించి 15 రోజులు అవుతోందని అన్నారు. కళాశాల అధికార యంత్రాంగం ఆ ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించింది.